ఆస్ట్రేలియన్ బీఫ్ నుంచి కరోనా.. డబ్ల్యుహెచ్‌ఓ బృందం

వుహాన్ : కరోనా వైరస్ మూలాలు కనిపెట్టే లక్ష్యంతో చైనాలోని వుహాన్‌కు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం చివరికి కరోనా పుట్టుక విషయంలో చైనా పాడే పాటనే పాడుతున్నట్లుగా ఉంది. కొవిడ్ ఇతర దేశాల నుంచి చైనాకు వచ్చిన కోల్డ్ చెయిన్ ఉత్పత్తుల నుంచే కరోనా తమ దేశానికి వచ్చిందని డ్రాగన్ దేశం ఎప్పటి నుంచో వాదిస్తూ వస్తోంది. ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో బృందం కూడా సేమ్ టు సేమ్ అలానే చెబుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ కరోనా చైనాలోనే పుట్టిందనీ చైనాపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో చైనా వాదనకు ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో బృందంకూడా తోడైందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా కొవిడ్ పుట్టక గురించి తేల్చేందుకు 14 మంది సభ్యుల డబ్య్లుహెచ్‌వో బృందం చైనాకు వెళ్లింది. వారి విచారణలో కూడా కరోనా ఆస్ట్రేలియన్ బీఫ్‌లాంటి కోల్డ్‌చెయిన్ ఉత్పత్తుల నుంచే మొట్టమొదటగా కరోనా వచ్చినట్లు అంచనాకు వచ్చారు. చివరికి ఈ బృందం కూడా.. కరోనా మూలాలు చైనా ల్యాబ్ నుంచి వచ్చింది కాదని తేల్చింది. దీనిపై ఈ టీమ్ లీడర్ పీటర్ ఎంబారెక్ మాట్లాడుతూ.. చైనాకు కరోనా బయటి దేశాల నుంచి వచ్చిందా ? అన్న అంశంపై అధ్యయనాలు కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అలాగే ఇక చైనా ల్యాబ్ నుంచి కరోనా పుట్టింది అన్న వార్తలు అవాస్తవమనీ, ఇక నుంచీ.. ల్యాబ్ నుంచి కరోనా అన్న అంశంపై తదుపరి విచారణ ఉండబోదని ఆయన ప్రకటించడం గమనార్హం. ఈ టీమ్ లీడర్ పీటర్ ఎంబారెక్ మాట్లాడుతూ.. చైనాకు కరోనా బయటి దేశాల నుంచి వచ్చిందా అన్న అంశంపై అధ్యయనాలు కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్పారు. ల్యాబ్ నుంచి కరోనా అన్న అంశంపై ఇక తదుపరి విచారణ ఉండబోదని కూడా ఆయన ప్రకటించడం గమనార్హం.