ఆ ఎంపీ చ‌నిపోలేదు..

అశోక్ గ‌స్తీకి చికిత్స కొన‌సాగుతోందిః వైద్యులు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్ల‌మెంటు స‌భ్యుడు అశోక్ గ‌స్తీ(55) గురువారం క‌రోనా సోకి చికిత్స పొందుతూ మ‌ర‌ణించారంటూ పెద్ద ఎత్తున వ‌చ్చిన వార్త‌ల‌పై ఆసుప‌త్రి వ‌ర్గాలు స్పందించాయి. ఆయ‌న చ‌నిపోయాడంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని పేర్కొన్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థ‌తి విష‌మంగా ఉంద‌ని, వైద్య చికిత్స అందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అశోక్ గ‌స్తీ క‌ర్ణాట‌క నుంచి బీజేపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. బెంగ‌ళూరులోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన‌ట్లు సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం న‌మ్మి ప‌లువురు నాయ‌కులు ట్విట్ట‌ర్ వేదిక‌గా సంతాపాలు కూడా వ్య‌క్తం చేశారు. ఈనేప‌థ్యంలో ఆయ‌న చికిత్స పొందుతున్న మ‌ణిపాల్ ద‌వాఖాన వైద్య‌డు డాక్ట‌ర్ సుద‌ర్శ‌న్ బ‌ల్లాల్ స్పందిచారు. ఎంపీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నార‌ని. ప్ర‌స్తుతం ఆయ‌న్ను ఐసియులో లైఫ్ స‌పోర్టుపై వైద్య చికిత్స కొన‌సాగిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. దీంతో ఈ ఎంపి మ‌ర‌ణ‌వార్త‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు పులుస్టాప్ ప‌డింది.

Leave A Reply

Your email address will not be published.