ఆ చిన్న రాయికి రూ.12 కోట్లు!

ఇండోనేషియా: లక్కు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము.. సుడి ఉంటే పూటకు లేని వారు కూడా కోట్లకు పడగెత్తవచ్చు.. కొందరు ఏళ్ల తరబడి ఎంత కష్టపడ్డా విజయం దరి చేరదు.. అయితే, ఒక్కోసారి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అలా వచ్చిన అదృష్టాన్ని చేజిక్కించుకుంటే చాలు. లైఫ్ టర్న్ అవుతుంది. ఇండోనేషియాకు చెందిన 33 ఏళ్ల జోషువా అనే వ్యక్తి శవపేటికలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఓరోజు అతని ఇంటి పెరట్లో పెద్ద శబ్దం అయ్యింది. వెళ్లి చూస్తే అక్కడ ఓ పెద్ద రాయి ఉంది. దానిని చూడగానే గ్రహశకలం అని జోషువా గుర్తించాడు. పైగా ఆ రాయి వేడిగా ఉండటంతో దానిని తీసుకెళ్లి ఇంట్లో దాచాడు. ఆ తరువాత దానికి వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో పోస్ట్ చేసిన కొన్ని రోజులకు అమెరికాకు చెందిన ఉల్కల నిపుణుడు జేర్డ్ కొల్లిన్స్ అనే వ్యక్తి ఆ గ్రహశకలాన్ని జోషువా నుంచి 1.6 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఆ గ్రహశకలం 450 కోట్ల సంవత్సరాలనాటిదని ఉల్కల నిపుణుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ గ్రహశకలంపై పరిశోధనలు చేస్తున్నారు.