ఇందారం ఒపెన్ కాస్ట్‌లో ఉత్పత్తి ప్రారంభం

మంచిర్యాల : కోల్‌బెల్ట్ ఏరియాలో మరో కొత్త ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు చేరింది. మంంచిర్యాల జిల్లాలోని ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌ను బుధవారం సింగరేణి ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ బలరాం ప్రారంభించారు. శ్రీరాంపూర్ డివిజన్‌లోని ఈ ఓసీపీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ రోజు బొగ్గు వెలికితీత పనులను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎండీ శ్రీధర్ సారథ్యంలో సింగరేణి లాభాల బాటలో పయనిస్తున్నట్లు తెలిపారు. ఇందారం ఓపెన్‌కాస్టుకు తమ విలువైన భూములను ఇచ్చిన వారికి, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్‌గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదికి 12 లక్షల టన్నుల వార్షిక లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, అధికారులు, యూనియన్ల నాయకులు ఉన్నారు.