ఈతకోటలో రిటైర్ హెడ్ మాస్టర్ గండ్రోతు యర్రయ్య మృతి

రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లాలోని ఈతకోట గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ రిటైర్ హెడ్ మాస్టర్ గండ్రోతు యర్రయ్య ( 90) గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.కుమారుడు జి.వి.వి.ఎస్.రవికుమార్ ఎస్.బి.హెచ్ లో మేనేజర్ గా పని చేసి పదవీ విరమణ చేశారు. కుమార్తె లు.జ్యోతి,వాణి. జ్యోతి భర్త. దారపరెడ్డి వెంకట రామయ్య డిసిసిబి లో జనరల్ మేనేజర్ గా పని చేసి పదవీ విరమణ చేశారు.వాణి భర్త గాంధీ రైతు. పశ్చిమగోదావరి జిల్లాలో పలు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, హెడ్ మాస్టర్ గా ఆయన పని చేసారు. యర్రయ్య మాస్టర్ మృతికి కొత్తపేట మాజీ శాసన సభ్యులు బండారు సత్యానంద్ రావు, తెలుగు దేశం పార్టీ నాయకులు ఆకుల రామకృష్ణ, మండపేట వైఎస్సార్ సీపీ కార్యదర్శి టి.పుల్లేశ్వరరావు తదితరులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.