ఈ 31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి: సిఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్ : తెలంగాణ సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ నెల (జనవరి) 31 లోపు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సిఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బిఆర్‌కేఆర్ భవన్‌లో ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో బుధవారం సీఎస్ సమీక్షించారు. ఈ సమావేశంలో కార్మిక, ఉపాది శిక్షణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఇరిగేషన్ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, రహదారులు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, అడిషనల్ డిజి (L&O) జితేందర్, కార్యదర్శులు ఎస్ఏఎం రిజ్వీ, బి.వెంకటేశం, సందీప్ కుమార్ సుల్తానియా, జనార్దన్ రెడ్డి, అహ్మద్ నదీమ్, అనిల్ కుమార్, దివ్య, నీతూప్రసాద్, క్రిస్టినా చోంగ్తు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎక్కువ మంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాలన్నది సర్కార్ ఉద్దేశమని సిఎస్ ఈ సందర్భంగా తెలిపారు. తదనుగుణంగా వివిధ కేటగిరీలలో ఏర్పడిన పదోన్నతుల ఖాళీలను భర్తీ చేయుటలో ఎదురవుతున్న సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.