ఉపద్రవాల నివారణకు కృషి చేస్తున్న కూనపురెడ్డి రెడ్డి కన్నబాబు
24 గంటలు తుఫానుపై రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తున్న వైనం.
విపత్తుల శాఖ కమిషనర్ ఐఏఎస్ అధికారి కూనపురెడ్డి కన్నబాబు గత ఏడాది కాలంగా రాష్ట్రంలో ముంచుకొస్తున్న ఉపద్రవాల పై ఆయన రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కన్నబాబు ఐఏఎస్ అధికారి. తొలుత గ్రూప్-1 అధికారిగా నరసాపురం ఆర్డీవో గా పనిచేసి అనంతరం జాయింట్ కలెక్టర్ పురపాలక సంఘ డైరెక్టర్ గా కూడా పని చేశారు. డైరెక్టర్ గా ఉన్న కాలంలో రాష్ట్రంలో పురపాలక సంఘాలను ఎంతో పటిష్ట పరిచారు. ఆయన చేసిన సేవలను ఇప్పటికీ పురపాలక సంఘం కమిషనర్లు, కార్మికులు, ఇతర సిబ్బంది గుర్తు చేసుకుంటారు. కన్నబాబు గత ఏడాది కాలంగా రాష్ట్ర విపత్తుల సంస్థ కమిషనర్ గాను గ్రామ సచివాలయం ఇన్చార్జి గాను సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో వచ్చిన తుఫాను లను తన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుగా పసిగట్టి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజల మొబైల్ లకు ఎస్ ఎం ఎస్ ల ద్వారా పంపిణీ చేసి అప్రమత్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో ఫలానా చోట ఫలానా సమయంలో పిడుగు పడే అవకాశాలు ఉన్నాయని ముందుగా హెచ్చరికలు జారీ చేయడం తో ప్రజలు మరింత అప్రమత్తం అవుతున్నారు. కారణంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించకుండా ప్రజలు ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఈ వారంలో వచ్చిన రెండు తుఫానుల గురించి కూడా ఆయన గత వారం రోజులుగా నిద్రాహారాలు లేకుండా తన కార్యాలయంలో ఉండి గంటగంటకు రాష్ట్రంలో అన్ని జిల్లా యంత్రాంగాలతో చర్చలు జరిపి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తం చేశారు. ఆయన సేవలు ఎంతో ప్రశంసనీయమని ప్రజాప్రతినిధులు సైతం కొనియాడుతున్నారు. కన్నబాబు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఆణిముత్యం కావడం విశేషం. నర్సాపురం రెవెన్యూ డివిజన్ లో ఆయన చేసిన సేవలు ఇప్పటికీ పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటారు. డీ ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ గా నిష్పక్షపాతంగా అన్ని సామాజిక వర్గాలకు రుణాలు పంపిణీ చేసి రాష్ట్రంలో అత్యున్నత ప్రాజెక్టు డైరెక్టర్గా అవార్డు తీసుకున్నారు. కన్నబాబు ను నాటి కలెక్టర్లు కూడా ఆయనను ప్రశంసించడం విశేషం. ఈ ఉత్తమ ఐఎఎస్ అధికారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆశిద్దాం.
-టి.వి.గోవిందరావు