ఉప్పాడ సముద్రతీరంలో రోజుకో మార్పు?
నిన్న ఎరుపు, నీలం రంగులో దర్శనం.. నేడు వెనక్కి వెళ్లిన బీచ్
కాకినాడ (CLiC2NEWS): దేశమంతా ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు `తౌక్టే` తుపాను ముంచుకొస్తుంది. ఈ తుపాను ప్రస్తుతం కేరళను వణికిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అక్కడ. దానికి తోడు కేరళలో ఈదురు గాలులు వేగంతో వీస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.
కాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో కనిపిస్తున్న మార్పులతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇవాళ (ఆదివారం) సముద్రం ఇక్కడ కొన్ని అడుగుల మేర వెనక్కి వెళ్లింది. అలాగే నిన్న(శనివారం) ఉప్పాడ బీచ్‌లో ఎరుపు, నీలం రెండు రంగులుగా మారిపోయి కనిపించింది. ఇవాళ సముద్రం బీచ్ రోడుకి కాస్తా దూరంగా వెళ్ళటంతో స్థానికులు ఈ మార్పులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పులు దేనికి సంకేతమో అని చర్చించుకుంటున్నారు. కాగా ఆటు పోట్ల సమయంలో సముద్రం వెనక్కి ముందుకు రావటం సర్వ సాధారణమని అయితే, తూపాను సమయంలో మరీ ఇంత వెనక్కి వెళ్ళటం ఏమిటని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ప్రస్తుతం `తౌక్టే` తుపాను కేరళను షేక్ చేస్తోంది. అక్కడ భారీ వర్షాలు, ఈదురుగాలులతో తౌక్టే బీభత్సం సృష్టిస్తోంది. వాతావరణ శాఖ ఇప్పటికే ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించింది. ఇక కేరళలోని అనేక తీరప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. కొన్ని నదుల్లో నీటి మట్టం పెరగడంతో ఆనకట్టల గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చిన తౌక్టే తుపాను గుజరాత్ వైపు పయనిస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.