ఎండమంట: ఆ జిలాల్లో వడగాలులు వీచే అవకాశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటి కే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం ఉత్తర దిశనుండి తక్కువ ఎత్తులో గాలులు తెలంగాణా రాష్ట్రంలోకి వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అలాగే రెండు మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ గాలు ప్రభావంతో గురువారం, శుక్రవారం (ఇవాళ, రేపు) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలోని ఒకటి రెండు ప్రదేశాలలో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
