ఎపిలో కొత్తగా 115 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 115 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే తాజాగా క‌రోనా వైరస్‌ బారినపడిన వారిలో 93 మంది చికిత్సకు కోలుకున్నారు. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా తాజా చిత్తూర్‌ జిల్లాలో ఒకరు మరణించారు. తాజా మ‌ర‌ణంతో క‌లిపి రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 7173 మంది మృత్యువాతపడ్డారు. కాగా ఎపిలో ఇప్పటివరకు 8,90,556 మంది కరోనా బారినపడ్డారు. 8,82,462 మంది చికిత్సకు కోలుకోగా.. మరో 921 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నార‌ని అధికారులు బులిటెన్‌లో వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.