ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలబుల్‌’

కేంద్రంపై విరుచుకుపడిన శశి థరూర్‌

న్యూఢిల్లీ: ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలవుబుల్‌’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశి థరూర్ ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మ‌ర‌ణాలు, వారు ఉపాధి కోల్పోవ‌డం అనే అంశాల‌పై పార్లమెంట్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్‌ చేయలేదని లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ మంత్రి సంతోష్‌ కుమార్‌ గాంగ‍్వర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌ ఎన్డీఏ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలవుబుల్‌’ అంటూ ఎద్దేవా చేశారు. వలస కార్మికులు, రైతు ఆత్మహత్యలు, కోవిడ్ -19, ఆర్థిక వ్యవస్థపై డాటా లేదు అంటూ శశిథరూర్‌ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ‘ది నేమ్ ఛేంజర్స్’ అనే కార్టూన్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు థరూర్‌. దీనిలో మోదీ, నిర్మలా సీతారామన్‌, అమిత్‌ షాలు ‘నో డాటా అవైలబుల్’‌ అనే ప్లకార్డులు పట్టుకున్నట్లు ఉన్న కార్టూన్‌ని ట్వీట్‌ చేశారు‌.

 

వ్యవసాయ రంగంలో సంభవించే ఆత్మహత్యలు, అందుకు గల కారణాలకు సంబంధించి కేంద్రం దగ్గర ఎలాంటి డాటా లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో శశి థరూర్‌ ఈ ట్వీట్‌ చేశారు. అంతేకాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. ‘నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి డాటా లేదని నివేదించాయి’ అని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.