ఎపిలో కొత్త‌గా 102 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో గడచిన 24 గంటల్లో కొత్తగా 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఈ మేర‌కు గురువారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌ల‌పి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 890317కు చేరింది. ప్రస్తుతం 871 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వరకు 882275 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. తాజాగా కోవిడ్‌తో చిత్తూరు‌ జిల్లాలో ఒకరు మరణించారు. తాజా మ‌ర‌ణంతో క‌లిపి కరోనాతో మరణించిన వారి సంఖ్య 7171కు చేరిందని అధికారులు బులిటెన్‌లో వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.