ఎపిలో కొత్తగా 135 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 36,970 కరోనా పరీక్షలు నిర్వహించగా 135 కేసులు నిర్ధారణ అయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. ఇదే సమయంలో 82 మంది కరోనాబారి నుంచి కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు నమోదైన మొత్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య 8,90,215కు చేరింది. అలాగే 8,82,219 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా మరణంతో కలిపి ఇప్పటి వరకు 7,170 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 826 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు బులెటిన్లో పేర్కొన్నారు.