ఎపిలో కొత్తగా 147 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 147 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,92,008 కు చేరింది. వీరిలో 8,83,380 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,443 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మృతి చెందారు. తాజా మరణంతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,185 కి చేరింది. అలాగే కొత్తగా రాష్ట్రంలో 103 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు.