ఎపిలో కొత్తగా 253 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజాగా వైరస్ బారినపడిన వారిలో 137 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల వ్యవధిలో గుంటూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 7186 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,522కు చేరింది. 8,83,642 మంది చికిత్సకు కోలుకొన్నారు. ప్రతస్తుతం 1694 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు.