ఎపి:1 నుంచి 9వ తరగతి వరకు సెలవులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి దృష్ట్యా సర్కీర్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తదగతి వరకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సిఎం జగన్ సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.
టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

నిజానికి కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను ఇప్పటికే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. నీట్ పీజీ 2021 పరీక్ష సైతం కేంద్రం వాయిదా వేసింది. తెలంగాణలో ఈ సారి టెన్త్ ఎగ్జామ్స్ ను సర్కారు రద్దు చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటించింది. సెకండ్ ఇయర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అయితే ఏపీ మాత్రం పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది.