`ఎల్లంపల్లి`కి భారీగా వరద నీరు
మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు, ఎగువ ప్రాంతంలో కురిసిన వానలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో దీంతో అధికారులు 25 గేట్లు ఎత్తివేసి భారీగా నీటిని కిందికి వదులుతున్నారు. ఇప్పటి వరకు 2,27,735 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2,51,406 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా.. ప్రస్తుత నీటి నిల్వ 17.8970 టీఎంసీలుగా నమోదు అయ్యింది.