ఎల్లారెడ్డిలో శవంగా తేలిన అదృశ్యమైన చిన్నారి సౌమ్య

ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం మత్తమాల గ్రామంలో అదృశ్యమైన చిన్నారి సౌమ్య విగతజీవిగా కనిపించింది. బుధవారం ఉదయం నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో సౌమ్య మృతదేహం బయటపడింది. అయితే, రెండేళ్ల చిన్నారి మృతి స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.