ఏపీలో కొత్తగా 139 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 139 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కాగా 49,483 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 139 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కాగా కొవిడ్ వల్ల గడిచిన 24 గంటల్లో ఎవరూ మరణించలేదు. ఒక్కరోజులో 254 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 8,86,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 8,77,893 మంది రికవరీ అయ్యారు. కొవిడ్‌తో ఇప్పటివరకు 7,142 మంది మృత్యువాతపడ్డారు.