ఏపీలో కొత్తగా 238 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 326 కేసులు నమోదు కాగా, ఈరోజు ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 238 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుల చేసింది. కరోనా వల్ల పశ్చిమ గోదావరిలో ఇద్దరు, చిత్తూర్‌లో ఒక్కరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 882850కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3194కు చేరగా..ఇప్పటి వరకు 872545 మంది కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటి వరకు 7111 మంది చనిపోయారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 1,19,32,603శాంపిల్స్‌ పరీక్షించారు.

Leave A Reply

Your email address will not be published.