ఏపీలో కొత్తగా 500 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ (మంగళవారం) కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 563 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336కు చేరింది. 8,64,612 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 4660 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ్టివరకు 7,064 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 61, 452 మందికి కొవిడ్-19 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 1,09,37,377 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.