ఏపీలో కొత్తగా 5,795 కరోనా కేసులు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుతున్నట్టే కనిపించినా మళ్లి పెరిగాయి. కొత్తగా 5,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,23,512కు చేరింది. ఏపీలో ప్రస్తుతం 51,060 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,66,433 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్లారని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అయితే.. ఉభయ గోదావరి జిల్లాలు, చిత్తూరు జిల్లాలో మాత్రం కరోనా ఉధృతి తగ్గట్లేదు. రోజురోజుకూ ఈ జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తగ్గట్లేదు. గత 24 గంటలుగా 33 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కృష్ణా జిల్లాలో-07, చిత్తూరు, కడప జిల్లాల్లో ఐదుగురు.. అనంతపురం, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరిలో-03, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,019కి చేరింది. కాగా.. ఏపీలో ఇప్పటి వరకు 61.50 లక్షల కరోనా టెస్ట్‌లు చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 6,046 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.