ఏపీలో కొత్తగా 6,242 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజు వ్యవధిలో 72,811 నమూనాలు పరీక్షించగా 6,242పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన ఒక రోజు వ్యవధిలో 7,084 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 60,94,206 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 54,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 40 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 5,981కి చేరింది.
జిల్లాలవారీగా మరణాలుః
కృష్ణా జిల్లాలో6 మంది, అనంతపురంలో 5, చిత్తూరు 5, తూర్పుగోదావరి 4, గుంటూరు 4, నెల్లూరు 4, ప్రకాశం 3, విశాఖపట్నం 3, శ్రీకాకుళం 2, కర్నూలు, విజయనగరం జిల్లాలో ఒకరు చొప్పన మరణించారు.