ఏపీలో కొత్తగా 64 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 64 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కాగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. అలాగే తాజాగా వైరస్ బారినపడిన వారిలో 99 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కాగా ఏపీలో ఇప్పటివరకు 8,87,900 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,79,504 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 1242 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.