ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు
అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 664 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 835 మంది కోలుకొని డిశ్చార్జికాగా 11 మంది చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,70,076కు చేరింది. ఇవాళ్టి వరకు 8,56,320 మంది కోలుకున్నారు. మరో 6,742 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర ఇన్ఫెక్షన్ల కారణంగా 7014 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 63,049 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 1,02,29,745 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.