ఏపీలో కొత్తగా 1,316 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కొత్తగా 1,316 కరోనా కేసులు నమోదు కాగా 11 మరణాలు చోటుచేసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,58,711కి కరోనా కేసులు చేరగా 6,910 మంది మరణించారు. ఏపీలో 16,000 యాక్టివ్ కేసులు ఉండగా 8,35,801 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు 94.08 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు. కొత్తగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.
అలానే జిల్లా వారీగా కేసులు చూస్తే అనంతపురంలో 60, చిత్తూరులో 198, తూర్పుగోదావరి జిల్లాలో 183, గుంటూరులో 206, కడపలో 58, కృష్ణాలో 196, కర్నూలులో 14, నెల్లూరులో 40, ప్రకాశంలో 43, శ్రీకాకుళంలో 28, విశాఖపట్నంలో 45, విజయనగరంలో 18, పశ్చిమ గోదావరిలో 227కేసులు నమోదయ్యాయి.