ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎట్టేకలకు వాటి నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబరు 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సెప్టెంబర్ 10,11 తేదీల్లో ఐసెట్, 14న ఈసెట్, 2,29,30 తేదీల్లో ఏపీ పీఈసెట్, అక్టోబర్ 1న ఎడ్‌సెట్, 2వ తేదీన లాసెట్ నిర్వహించనుంది.

ఇక తెలంగాణలో ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్ స్లాట్సును బట్టి ఖరారు చేయనుంది.