ఏపీ కొత్తగా 1,728 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,148 పరీక్షలు నిర్వహించగా 1,728 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 849705కి చేరింది. ఇందులో 822011 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 20857 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6837కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 99, చిత్తూరులో 206, తూర్పుగోదావరి జిల్లాలో 290, గుంటూరులో 212, కడపలో 85, కృష్ణాలో 223, కర్నూలులో 36, నెల్లూరులో 91, ప్రకాశంలో 88, శ్రీకాకుళంలో 43, విశాఖపట్నంలో 74, విజయనగరంలో 42, పశ్చిమ గోదావరిలో 239 కేసులు నమోదయ్యాయి.