ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ..!

తాడేపల్లి : ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమండిసెంబర్‌ 25న ప్రారంభం కానుంది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. డిసెంబర్‌ 25న అర్హులకు డి-ఫామ్‌ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,68,281మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరందరికి పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మెదలుకానున్నాయి. తొలి దశలో దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

Leave A Reply

Your email address will not be published.