ఏపీ: 24 గంటల్లో 8,473 మంది డిశ్చార్జ్

అమరావతి : ఎపిలో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 61,838 నమూనాలను పరీక్షించగా.. 10,830 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,528 కేసులు.. అత్యల్పంగా కృష్ణాజిల్లాలో 299 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 8,473 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 81 మంది బాధితులు చికిత్స పొందుతూ మరణించారు. తూర్పు గోదావరిలో 11 మంది, ప్రకాశం 9, చిత్తూరు 8, కడప 8, అనంతపురం 6, పశ్చిమ గోదావరి 6, కృష్ణా 5, నెల్లూరు 5, విశాఖపట్నం 5, విజయనగరం 5, కర్నూలు 5, గుంటూరు 4, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 3,541కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 34,18,690 నమూనాలు పరీక్షించగా.. 3,82,469 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 34,18,690 మందికి కరోనా పరీక్షలు చేశారు.