ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ రవీందర్ రెడ్డి

జనగామ: ఇరిగేషన్ డిపార్టమెంట్కు చెందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకెళ్తే.. ఇరిగేషన్ డిపార్టమెంట్ డీఈ రవీందర్ రెడ్డి శనివారం ఓ కాంట్రాక్టర్ నుంచి 50 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.