ఓఆర్‌ఆర్‌పై ఓల్వో బస్సు దగ్ధం

హైదరాబాద్: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని అవుటర్ రింగ్‌రోడ్డుపై ఓల్వో బస్సు దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపు వస్తున్న ఓల్వో బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. చూస్తుండగానే దావానంలా వ్యాపించడంతో గమనించిన డ్రైవర్ బస్సులోంచి కిందికి దూకాడు. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.