ఓయూ లా కాలేజీలో పీజీ డిప్లొమా కోర్సుల్లో దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో 6 పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయ్యింది. కాగా ఉస్మానియా వర్సిటీ లా కాలేజీలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తును ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ అధికారులు తెలిపారు. గతంలో సైబర్ లాస్, టాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్ లాస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌లో పీజీ డిప్లొమా కోర్సులు ఉండేవని, కొత్తగా ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ లాస్, అప్లైడ్ హ్యూమన్ రైట్స్, మోడర్న్ కార్పొరేట్ లాస్ కోర్సులను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 040–27682368, 23231092 నంబర్లలో సంప్రదించాలని సూంచించారు.