ఓల్డ్ మలక్‌పేట వార్డుకు రీపోలింగ్ ప్రారంభం

హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట వార్డు(డివిజన్)కు గురువారం ఉదయం రీపోలింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ పేపర్లో సీపీఐ అభ్యర్థి గుర్తు తప్పుగా ముద్రించడంతో రీపోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ సందర్భంగా వర్తించే అన్ని నిబంధనలు సంబంధిత పరిధిలో వర్తిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవుతో పాటు మద్యం దుకాణాల బంద్, ప్రచారం నిషేధం వంటివన్నీ అమలులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు వరకు: ఓల్డ్ మలక్‌పేట వార్డు( డివిజన్)లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 4.4 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
- వార్డులో మొత్తం ఓట్లు: 54,655
- పురుషులు : 27889
- మహిళలు: 26763
- ఇతరులు 3
- పోలింగ్ కేంద్రాలు 69
- విధుల్లో ఉండే మైక్రో అబ్జర్వర్లు 12 మంది.
- వెబ్‌కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాలు:23