కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూత

కడప : కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో శివానంద రెడ్డి తుది శ్వాస విడిచారు. కందుల శివానంద రెడ్డి 1989 లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యే గా గెలిచారు. ఆ తరువాత టిడిపి లో చేరారు. 2004, 2009 సంవత్సరాల్లో కడప ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు కందుల గ్రూప్స్‌ పేరుతో పలు విద్యాసంస్థలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.