కడుపులో గ్యాస్ సమస్య- నివారణ

పండుగ సమయాలలో మనం తినే అనేక రకాల పిండివంటలు వల్ల కొందరికి కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుంది. అల్లం వెల్లుల్లి ముక్కలను మెత్తగా దంచి గోరువెచ్చని నీటిలో వేసి త్రాగాలి. వాము పొడి నిమ్మరసం కూడా గోరువెచ్చని నీటితో తాగవచ్చు. అజీర్తి గ్యాస్ తగ్గిపోతుంది. తమలపాకును ముక్కలుగా తుంచి నీటిలో మరిగించి చల్లార్చి తేనె కలిపి త్రాగాలి. చెరుకు రసం లో నిమ్మరసం సైంధవ లవణం కలిపి త్రాగిన గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. చింతపండు రసంలో తాటి బెల్లం కలిపి త్రాగితే గ్యాస్ సమస్య రాదు. మునగాకును నీటిలో మరిగించి సైంధవ లవణం వేసి చల్లార్చి త్రాగితే అజీర్తి గ్యాస్ సమస్య రాదు. అప్పుడప్పుడు బొప్పాయి పండు తిన్నా కూడా అజీర్తి తగ్గి గ్యాస్ సమస్య రాదు.పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి చల్లార్చి నిమ్మరసం తేనె కలిపి త్రాగాలి. అజీర్తి గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. అప్పుడప్పుడు కొన్ని ధనియాలు జీలకర్ర వాము ఈ మూడింటిని నీటిలో మరిగించి కొద్దిగా సైంధవ లవణం వేసి త్రాగితే అజీర్తి గ్యాస్ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుంది
– పి . కమలాకర్ రావు