కరోనాతో ఖండ్వ ఎంపి మృతి

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి బారిన పడి మరో బీజేపీ ఎంపీ కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌ బీజేపీ లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నంద్‌కుమార్‌ మధ్యప్రదేశ్‌ ఖండ్వ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో భోపాల్‌ నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు. గత జనవరి 11న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. చౌహాన్‌ గత కొద్దిరోజులుగా ఆయన వెంటిలెటర్‌పైనే ఉన్నారు. ఆయన గతంలో పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన స్వస్థలం నిమార్‌లోని బుర్హాన్‌పూర్‌ జిల్లాలోని షాపూర్‌. 8 సెప్టెంబర్‌, 1952లో జన్మించారు.

ప్ర‌ధాని మోడీ సంతాపం..
ఎంపి మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. పార్టీకి ఆయన లేని లోటు తీరనిది అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే నంద్‌కుమార్ మృతిపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, అంకితభావం గల నాయకుడిని కోల్పోయిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.