కరోనాతో తమిళనాడు మంత్రి కన్నుమూత

చెన్నై: కరోనా వైరస్ బారినపడి తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దొరైక్కన్ను(72) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంత్రి దొరైక్కన్నుకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అక్టోబరు 13న విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. తరువాత మెరుగైన చికిత్స కోసం కావేరీ ఆసుపత్రికి తరలించారు. శనివారం మంత్రి దొరైక్కన్ను ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తుల్లో 90 శాతం మేరకు ఇన్‌ఫెక్షన్ చేరినట్టు సీటీ స్కాన్‌లో వెల్లడయ్యింది. దీంతో ఈసీఎంఓపై చికిత్స అందించారు. ఈ క్రమం‍లోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి దొరైక్కన్ను1948లో తంజావూరు జిల్లా రాజగిరిలో దొరైక్కన్నులో జన్మించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016 ఎన్నికల్లో గెలుపొందిన ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దొరైక్కన్నుకు భార్య, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంత్రి మృతిపట్ల తిమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

1 Comment
  1. […] కరోనాతో తమిళనాడు మంత్రి కన్నుమూత […]

Leave A Reply

Your email address will not be published.