కరోనాన్ని జయించిన నిర్మల్ డిఎస్‌పి ఉపేంద్ర రెడ్డి

నిర్మల్ః కోవిడ్-19ను కోలుకోని 21 రోజుల అనంతరం సోమవారం విధుల్లో చేరిన సందర్భంగా నిర్మల్ సబ్ – డివిజన్ డిఎస్‌పి ఉపేంద్ర రెడ్డికి స్థానిక పోలీసులు ఘనంగా సన్మానించారు. ఈ కర్యక్రమంలో నిర్మల్ సబ్–డివిజన్ పోలీసు అధికారులు నిర్మల్ పట్టణ/గ్రామీణ మరియు సొన్ సిఐ కరోనానుజయించిన డిఎస్పీకి శాలువాలు, పూలదండలతో సన్మానించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ అమలు, కరోనా వైరస్ నిర్ములనలో జిల్లా పోలీసు నిర్విరామంగా పనిచేసింది. విధుల నిర్వహణలో జిల్లా పోలీసు అధికారులు/సిబ్బంది కరోనా వైరస్ కు గురైనారు, మనోధైర్యంతో ఉంటే ఎలాంటి వ్యాధులలనైనా జయించవచ్చు. మంచి ఆహారం తీసుకోవడం, వైద్యులు చూపించిన మందులు సక్రమంగా వేసుకోవడం వల్ల కరోనా నుండి త్వరగా కొలుకుంటున్నారు అన్నారు. ప్రజలు దైర్యంగా ఉండాలని అన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని బయటకు వెళితే మాస్క్ లు వాడాలని అన్నారు.