కామారెడ్డిలో కరెంట్ షాక్‌తో కార్మికుడు మృతి

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లాలో కరెంట్ షాక్‌తో కార్మికుడు మృతి చెందాడు. జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంలో విద్యుత్ స్తంభాలకు బల్బులు బిగిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కార్మికుడు నర్సింహులు ఘటనాస్థలంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.