కామెరూన్‌లో బస్సును ఢీ కొన్న ట్రక్కు: 53 మంది మృతి

యాండే: కామెరూన్‌లోని పశ్చిమ ప్రాంతంలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 53 మంది మృతి చెందారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సును ఆయిల్‌ తరలిస్తున్న ట్రక్కు శాంక్చు గ్రామం వద్ద ఢీ కొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 53 మంది మరణించారని, మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. ట్రక్కు ఢీ కొట్టడంతో..ఆయిల్‌ బస్సుపై పడిందని, అదే సమయంలో మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాగా కామెరూన్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. ప్రభుత్వం నిర్లక్ష్యంగా నడుపుతున్న డ్రైవర్లను మరియు వాహనాల పేలవమైన స్థితిని నిందించగా, డ్రైవర్లు రోడ్ల చెడు పరిస్థితులను నిందించారు. గ‌త డిసెంబరులో, పశ్చిమ గ్రామమైన మాకెనెలో జరిగిన ప్రమాదంలో 37 మంది మరణించ‌గా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.