కాలువలోకి దూసుకెళ్లిన కారు… ముగ్గురు మృతి

వరంగల్ : జిల్లాలోని పర్వతగిరి మండలం కొంకపాక గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బుధవారం వరంగల్ నుంచి పర్వతగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పర్వతగిరికి వెళ్తున్న క్రమంలో కారు డ్రైవర్ వేగంగా వెళ్లడంతో అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్‌లో పడిపోయింది. ఈత రావడంతో డ్రైవర్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. కారులో ముందు సీట్లో కూర్చున్న వ్యక్తితో పాటు వెనుకాల కూర్చున్న సరస్వతి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుతో పాటు మరో వ్యక్తి అందులోనే మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరకుని కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.