కేరళలో తాజాగా 10,606 కరోనా కేసులు నమోదు

తిరువనంతపురం: కరోనా మహమ్మరి కేరళలో రోజురోజుకి పెరిగిపోతోంది. ఆ మధ్య అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 10,606 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా వల్ల 22 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,53,405కు, మరణాల సంఖ్య 906కు పెరిగిందని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 92,161 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కేరళలో కరోనా మళ్లీ విజృభిస్తుండటంతో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న తిరువనంతపురం, కోజికోడ్, ఎర్నాకుళం వంటి జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. గత 24 గంటల్లో 6,161 మంది కోలుకుని దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 1,60,253 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.