కేర‌ళ సిఎంగా పిన‌ర‌యి విజ‌యన్ ప్ర‌మాణ‌స్వీకారం

తిరువ‌నంత‌పురం (CLiC2NEWS): కేర‌ళ ముఖ్య‌మంత్రిగా పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ విజయన్‌ చేత రెండోసారి సీఎంగా ప్రమాణం చేయించారు. విజ‌య‌న్ సీఎంగా ప్ర‌మాణం చేయ‌డం వ‌రుస‌గా ఇది రెండోసారి. సీఎంతో పాటు 21 మంది మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం విజ‌యన్‌తో పాటు మంత్రుల‌కు గ‌వ‌ర్న‌ర్, ఇత‌ర ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

కేర‌ళలో గతేడాది కరోనా కట్టడిలో ఆరోగ్య శాఖ మంత్రిగా కీలకపాత్ర పోషించిన కేకే. శైలజకు మంత్రి వర్గంలో చోటుదక్కలేదు. ఆమె స్థానంలో వీణా జార్జ్‌కు ఆరోగ్య శాఖ కేటాయించారు. ఇక పినరయి విజయన్‌ అల్లుడు మహ్మద్‌ రియాస్‌కు పబ్లిక్‌ అండ్‌ టూరింజ్‌ శాఖను అప్పగించారు.ఇక కేబినెట్‌లో చేరిన వారంతా అంద‌రూ కొత్త‌వారే.

Leave A Reply

Your email address will not be published.