కోటాలోనే విద్యార్థులు ఎందుకు చ‌నిపోతున్నారు?.. సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS): విద్యార్థుల వ‌రుస ఆత్మ‌హ‌త్య‌ల‌పై దేశ‌ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. కోటాలో చోటుచేసుకుంటున్న విద్యార్థుల వ‌రుస ఆత్మ‌హ‌త్య‌ల‌పై సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.
కోటాలోనే వ‌రుస‌గా విద్యార్థులు ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు?.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేస్తుంది?.. ఈ విష‌యం ఎందుకు ఆలోచించ‌డం లేదు .. అని రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాదిని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. ఆత్మ‌హ‌త్య‌ల కేసుల‌ను ప‌రిశీలించేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామ‌ని న్యాయ‌వాది బ‌దిలిచ్చారు.

రాజ‌స్థాన్ కోటాలో ఇప్ప‌టికే 14 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం.. సుప్రీంకోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఐఐటి ఖ‌ర‌గ్‌పుర్‌కు చెందిన విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన కేసును సుప్రీం విచారించింది. ఆమె మే 4న హాస్ట‌ల్ గ‌దిలో ఉరివేసుకొని మ‌ర‌ణించ‌గా.. పోలీసులు మే 8న ఎఫ్ ఐ ఆర్‌న‌మోదు చేశారు. విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల కేసుల‌ను విచారించిన జ‌స్టిస్ జెబిపార్టివాలా, జ‌స్టిస్ ఆర్‌. మ‌హాదేవ‌న్‌ల ధ‌ర్మాసనం.. ఎఫ్ ఐ ఆర్ న‌మోదులో పోలీసుల వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టింది.

ఎఫ్ ఐ ఆర్ న‌మోదుకు ఆల‌స్యం ఎందుకు జ‌రిగింద‌ని పోలీసు అధికారిని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. ఈ కేసుల‌ను తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని, చాలా తీవ్ర‌త క‌లిగిన అంశాల‌ని పేర్కొంది. ఇటువంటి కేసుల్లో త్వ‌ర‌గా ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేయ‌డం ఎంతో ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. సంబంధిత అధికారి విధి నిర్వ‌హ‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యార‌ని.. దీనిపై జులై 14 స‌ద‌రు పోలీసు అధికారి హాజ‌రై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని స‌మ‌న్లు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.