కొరడాతో కొట్టించుకున్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ సిఎం

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్ సిఎం భూపేశ్ బ‌ఘేల్ కొర‌డాతో కొట్టించుకున్నాడు. ఆదివారం దుర్గ్ జిల్లాలోని జ‌జంగిర్ గ్రామంలో జ‌రిగిన గోవ‌ర్థ‌న్ పూజ‌లో ఆయ‌న పాల్గొన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని చేతి మీద కొర‌డాతో ప‌లుమార్లు కొట్టించుకున్నారు. ఆ రాష్ట్రంలో ఏటా దీపావ‌ళి అనంత‌రం గోవ‌ర్థ‌న్ పూజ జ‌రుగుతుంది. ఈ పూజ‌లో ప్ర‌తి ఏడాది పాల్గొనే సిఎం ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం కొరాడాతో కొట్టించుకునే ఈ సంప్ర‌దాయాన్ని పాటిస్తారు.

 

Leave A Reply

Your email address will not be published.