కొవిడ్‌పై ముఖ్యమంత్రులతో 17న పిఎం మోడీ సమావేశం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఇప్పటికే ప్రధాని మోడీ పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో సమావేశమై చర్చించారు.