ఘనంగా `తోట` జన్మదిన వేడుకలు

మండపేట: వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు తోట త్రిమూర్తులు తనయుడు తోట పృధ్విరాజ్ జన్మదిన వేడుకలు సోమవారం మండపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ కి చెందిన కార్యకర్తలు యువనాయకులు, యువకులు వందలాది మంది ఈ వేడుకల్లో పాల్గొని తోట పృథ్వీరాజ్ సమక్షంలో కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. తొలుత పడాల సత్యేంద్ర ఆధ్వర్యంలో మండపేట పట్టణంలో 4వ వార్డు లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ సన్నిధిలో పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పృథ్వీ రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు కార్యకర్తల మధ్య పవిత్ర దేవాలయంలో జరుపుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. యువ నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 45 వేల కోట్ల రూపాయలు పేద ప్రజల సంక్షేమానికి ఇస్తున్నారన్నారు. భారతదేశంలో ఉన్న మిగిలిన 28 రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో పేదల సంక్షేమానికి ఎవరు ఖర్చు పెట్టడం లేదన్నారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ముగ్దులవు తున్నారన్నారు. పేద ప్రజలంతా తమకు ఏ కష్టం వచ్చినా మండపేట నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులు వద్దకు వచ్చి తెలియజేస్తే వారికి తగిన న్యాయం చేకూరుతుందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన మాటలకు కట్టుబడి 95శాతం హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసిన వ్యక్తి డైనమిక్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమేనన్నారు. గత ప్రభుత్వాలు మేనిఫెస్టోలో పెట్టిన 40 శాతం అంశాలను కూడా అమలు చేయలేదన్నారు. కేవలం పటాటోపం మాదిరిగా పత్రికలకే పరిమితమై సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వాలు చేయడం జరిగిందన్నారు. తన పుట్టినరోజును నియోజకవర్గంలో యువత ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు ఈ విధంగా సేవ చేయడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు యువత ముందుకు రావాలని ఆయన కోరారు. వైఎస్సార్సీపీ నాయకుడు జిన్నూరి సత్య సాయిబాబా మాట్లాడుతూ పృథ్వీ రాజ్ తండ్రి ని మించిన తనయుడు అని ఆయన కొనియాడారు. మనోనిబ్బరం, నీతి నిజాయితీ కలిగిన యువకుడు అని ఆయన ప్రజా సేవ చేయడానికి ముందుకు రావడం అందరికీ ఆనందదాయకం ఉన్నారు. విద్యావంతులైన పృథ్వీ రాజ్ ను యువత మార్గదర్శకంగా తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమాన్ని నిర్వహించిన పడాల సత్యేంద్ర ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ రబ్బానీ, కంకటాల సురేష్, శీలం అప్పారావు, పిల్లా అరవ రాజు, అడ్డగర్ల మహేష్, వుండమట్ల నాగు, రామిశెట్టి శ్రీ హరి, సూరపురెడ్డి చిన్నారి, అలమండ మణికంఠ, గండి విజయ్ కుమార్, సలాది సత్తిబాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.