కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం హైదరాబాద్ లో మొదలయిన ట్రైనింగ్

హైద‌రాబాద్‌: వ్యాక్సినేషన్ ప్రణాళిక, కోల్డ్ చైన్ నిల్వ,టీకా ఇవ్వాల్సిన పద్దతుల పై కేంద్రం మార్గదర్శకాలతో, వాక్సినేషన్ ఇచ్చేందుకు రాష్ట్రాలు సిద్ధం సిద్ధం అవుతున్నాయి. వాక్సినేషన్ ఇచ్చేందుకు జిల్లాల ఆరోగ్య శాఖ అధికారులకు ట్రైనింగ్ యూనిసెఫ్ ప్రతినిధులు ఇస్తున్నారు. వాక్సిన్ ఇవ్వడానికి తీసుకోవాల్సిన చర్యలు, వాక్సినేటర్లు, వాళ్ళ బాధ్యతలు, వాక్సిన్ గదుల ఏర్పాటు.. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల DM&HO సమావేశం అయ్యారు. ప్రజలను ఏవిధంగా చైతన్యవంతం చేయాలి ? ఎవరెవరిని ఇందులో భాగస్వామ్యం చేయాలి అనేదాని పై సూచనలు చేస్తున్నారు. ఈ సమావేశంలో యునెసెఫ్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.