కన్న కూతుళ్లను డంబెల్‌తో కొట్టి చంపిన తల్లి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మదనపల్లె శివనగర్‌లో కన్న బిడ్డలనే డంబెల్‌తో కొట్టి చంపింది ఓ తల్లి. నవమాసాలు మోసి కన్న కూతుళ్లు సాయిదివ్య(22), అలేఖ్య(27)ను తల్లి పద్మజ దారుణంగా చంపేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా నిందితురాలు పద్మజ మానసిక ఆరోగ్యం నిలకడగా లేదని పోలీసులు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.